ప్రాణాలతో చెలగాటం: ఒకే ‘ఎక్సెల్’ వాహనంపై ఆరుగురి ప్రయాణం

by Ramesh Naini |

రోడ్డు భద్రతా నియమాలను గాలికొదిలేసి, ప్రాణాలను పణంగా పెట్టి సాగించిన ఓ ద్విచక్ర వాహన ప్రయాణం శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది.

ప్రాణాలతో చెలగాటం: ఒకే ‘ఎక్సెల్’ వాహనంపై ఆరుగురి ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు భద్రతా నియమాలను గాలికొదిలేసి, ప్రాణాలను పణంగా పెట్టి సాగించిన ఓ ద్విచక్ర వాహన ప్రయాణం శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. మడకశిరలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఒక కుటుంబానికి చెందిన ఏకంగా ఆరుగురు సభ్యులు కేవలం టీవీఎస్ ఎక్సెల్ (XL) వాహనంపై అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. వాహనంపై పిల్లలు కూర్చోవడానికి వీలుగా ఆ తండ్రి చేసిన ప్రయోగం చూసి దారిన పోయే వారు షాక్ అయ్యారు. వాహనం ముందు భాగంలో ఏకంగా ఒక ఊతకర్రను అమర్చి, దానికి ఆసరాగా పిల్లలను కూర్చోబెట్టి ఆయన వాహనాన్ని నడిపాడు.

చిన్న ఎక్సెల్ వాహనంపై ఆరుగురు కూర్చోవడంతో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, ఆ తండ్రి ఏమాత్రం భయం లేకుండా వాహనాన్ని నడపడం గమనార్హం. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి సాహసాలు చేయడం తగదని నెటిజన్‌లు హితువుపలికారు.

Next Story