ఏపీ పాలిటిక్స్‌లో అలజడి సృష్టించిన ఆర్జీవీ ‘వ్యూహం’!

by Disha Web Desk 2 |
ఏపీ పాలిటిక్స్‌లో అలజడి సృష్టించిన ఆర్జీవీ ‘వ్యూహం’!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ పాలిటిక్స్‌లో మరోసారి అలజడి మొదలైంది. కల్పిత పాత్రలని చెబుతూనే ఆంధ్రా పాలిటిక్స్ చుట్టూ తిరిగే సినిమా టీజర్ ఇవ్వాళ్ల రిలీజ్ అయ్యింది. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో సంచలనం సృష్టిస్తుంటారు. అయితే, ఆర్జీవీ వ్యూహాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ‘వ్యూహం’ సీఎం జగన్ జీవితం ఆధారంగా ఈ మూవీ రాబోతున్నది. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, సినిమాపై ఆసక్తిని పెంచాయి. శనివారం వ్యూహం టీజర్‌ను ఆయన విడుదల చేశారు.

అందులో ఏముందంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ జీవితంలో జరిగిన పరిణామాలు, ఓదార్పు యాత్ర, సీబీఐ అరెస్టు చేయడం ఆ తర్వాత విడుదల వంటి విషయాలను చూపించారు. ఈ టీజర్ చూసిన వారు ఆర్జీవిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరికొందరూ నెగిటీవ్ కామెంట్స్‌తో తిడుతున్నారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత పరిస్థుతులను ఆధారంగా చేసుకుని ‘శపథం’ సినిమాను కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వ్యూహం, శపథం రెండు చిత్రాలు ఎలక్షన్ల కంటే ముందే రిలీజ్ అవుతాయని సమాచారం.

Next Story

Most Viewed