- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీఎస్టీ శ్లాబుల సవరణ.. డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర ట్వీట్
జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ఇచ్చిన హామీని నెరవేర్చుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించడం శుభ పరిణామమని అన్నారు.
పేదలు, మధ్య తరగతి, రైతులు, ఆరోగ్య సంరక్షణకు గణనీయమైన ఉపశమనం అందించడం, అలాగే జీవితాలను కాపాడే, భవిష్యత్తును శక్తివంతం చేసే విద్య, బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించాడాని తాను ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని అన్నారు. ఈ సంస్కరణలు అసంఖ్యాక కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు, ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకొచ్చిన జీఎస్టీ కౌన్సిల్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచిన తర్వాత, ఈ జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి కానుకగా నిలుస్తాయని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.






