- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిర్చి క్వింటాకు రూ.11,600 ఇవ్వాలని కోరాం..
ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ(Ap)లో మిర్చి రైతులను(Chilly) ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రైతులకు చేయూతనిచ్చేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఈ రోజు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర ఇచ్చే అంశంపై చర్చించారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఏపీ నుంచి మిర్చి ఎగుమతికి ఉన్న అవకాశాల పైనా సమావేశంలో చర్చించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు(Ramohan naidu), పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ మిర్చి రైతులకు క్వింటాకు రూ.11,600, అంతకంటే ఎక్కువే మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.
ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కోరామన్నారు. ఐకార్(Icar) ద్వారా రైతులను ఆర్థికంగా భరోసా ఇవ్వాలని తెలియజేశారు. గతంలో జరిగినట్లుగా ఇప్పుడు మిర్చి ఎగుమతులు జరగడం లేదన్నారు. దానికి కొన్ని అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయన్నారు. మిర్చి ఎగుమతులను తిరిగి ఎలా ప్రోత్సహించాలి అనే చర్చించామన్నారు. రాష్ట్రంలో మిర్చి ఎగుమతి దారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయాలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. చంద్రబాబు విజనరీ లీడర్, ఆయన ఒక సమస్యను ఇక్కడి వరకు తీసుకువచ్చారంటే దానికి తీవ్రత ఉందన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి అన్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని అన్నారు. మార్కెట్ ధరకు ఉన్న వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీలో ఉన్న గుంటూరు పల్నాడు రాయలసీమ మిర్చి రైతులకు మేలు చేసేలా చూస్తామన్నారు.






