AP Theaters: థియేటర్లపై.. నివేదిక సిద్ధం!

by Thanuru Gopichand |

ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో నిన్న ఈ రోజు తనిఖీలు (Inspections) కొనసాగాయి

AP Theaters: థియేటర్లపై.. నివేదిక సిద్ధం!
X

రెండు రోజుల పాటు హాళ్లలో సదుపాయాలు, ధరలపై ఆరా

రెవెన్యూ, పోలీసు జాయింట్​ఆపరేషన్​

1300కు పైగా థియేటర్లలో తనిఖీలు

నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనున్న అధికార యంత్రాంగం

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో నిన్న ఈ రోజు తనిఖీలు (Inspections) కొనసాగాయిఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో నిన్న ఈ రోజు తనిఖీలు (Inspections) కొనసాగాయిఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో నిన్న ఈ రోజు తనిఖీలు (Inspections) కొనసాగాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు జాయింట్​ఆపరేషన్​చేసి హాళ్లలో ఉన్న సదుపాయాల గురించి ఆరా తీశారు. థియేటర్లలో తీసుకున్న భద్రతా చర్యలు, అవసరమైన సదుపాయాల లభ్యతపై అధికారులు సమగ్ర సమాచారం సేకరిచారు. అలాగే థియేటర్ క్యాంటీన్లలో ధరల పట్టిక ప్రదర్శన, టికెట్లతో పాటు ఆహార పదార్థాలను ఎంత ధరకు విక్రయిస్తున్నారన్న విషయాలపై కూడా పరిశీలించారు. సేకరించిన వివరాలతో తయారు చేసిన ని వేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధం అయ్యారు.

సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్ (Pawan kalyan) ​ప్రకటించినప్పటి నుంచి అధికార యంత్రాంగం అలర్ట్​అయింది. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబం డారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని ఆయన గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలని ఆయన సూచించారు.

ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లతో కలిపి 1300కు పైగా థియేటర్లు ఉన్నాయి. వాటిలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తు న్నారు.ఈ క్రమంలోనే ఏపీలోని సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. పారిశుద్ధ్యం, ఫైర్ సేఫ్టీ, ఆహార పదార్థాల ధరలతో పాటు 32 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కనీస వసతులు, నీటి బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలను పరిశీలించారు. కొన్ని థియేటర్లలో క్యాంటీన్లలో ఆహార పదార్థాలు, నీటి బాటిళ్లు అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వీటిన్నటితో ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధం అయ్యారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తున్నారు.

Next Story