- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD : రేణిగుంట ఎయిర్పోర్ట్ కు శ్రీవారి పేరు : టీటీడీ
తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టు(Renigunta Airport)కు తిరుమల శ్రీవారి పెట్టాలని టీటీడీ(TTD) నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టు(Renigunta Airport)కు తిరుమల శ్రీవారి పెట్టాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల సమావేశం కొద్దిసేపటిక్రితం ముగిసింది. ఈ సమావేశంలో తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీ వేంకటేశ్వర పేరు పెట్టాలని, అందుకుగాను ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు(AAI) పేరు మార్పు విషయమై లేఖ రాయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) పేర్కొన్నారు. అలాగే టీటీడీకి 100 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయిస్తామని కేంద్రం ఇచ్చిన హామీ అమల్లోకి రాబోతోందని, త్వరలోనే తిరుమలకు ఆ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నట్టు తెలిపారు.
వీటి వల్ల భక్తులకు ఉచిత రవాణా అందుబాటులోకి వస్తుందని అన్నారు. తిరుమలలో CSIR పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేయనుందని.. ఈ ల్యాబ్ లో నెయ్యి, నీరు, పప్పు ధాన్యాల నాణ్యతను పరిశీలించవచ్చని తెలిపారు.టీటీడీకి చెందిన 7 స్కూళ్లలో 1600 మంది విద్యార్థులకు హ్యూమానిటీ, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తామన్నారు. అదే విధంగా బెంగుళూరులో మరో పెద్ద శ్రీవారి ఆలయం నిర్మించాలని ఆ రాష్ట్రం కోరిందని, వారి వినతి మేరకు మరో విశాలమైన ఆలయం నిర్మిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.






