తిరుప‌తిలో ఉద్రిక్తత.. చిరు వ్యాపారుల స్టాళ్ల తొలగింపు

by Vemula.Srinu Prasad |

తిరుపతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిరు వ్యాపారాలపై మున్సిపల్ అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపారు..

తిరుప‌తిలో ఉద్రిక్తత.. చిరు వ్యాపారుల స్టాళ్ల తొలగింపు
X

దిశ, వెబ్ బెస్క్: తిరుపతి(Tirupati)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిరు వ్యాపారాల(Small businesses)పై మున్సిపల్ అధికారులు(Municipal Officials), పోలీసులు(Police) ఉక్కుపాదం మోపారు. అలిపిరి ప్రాంతం(Alipiri Area)లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందంటూ తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్ల(Carts, mobile vans)ను తొలగించారు. ఈ క్రమంలో అధికారులను మహిళలు, స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. తమ కడుపు కొట్టవద్దంటూ వేడుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ మేరకు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోలో ఇద్దరు వ్యాపారులకు సైతం గాయాలయ్యాయి.

పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం

దీంతో పోలీసుల తీరుపై చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న తమ వ్యాపారాలను ఒక్కసారిగా ధ్వంసం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి తాము వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని, తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story