ఏపీ భవన్‌లో ఆక్రమణల తొలగింపు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ ప్రాంగణంలో అధికారులు ఆక్రమణలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

ఏపీ భవన్‌లో ఆక్రమణల తొలగింపు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ ప్రాంగణంలో అధికారులు ఆక్రమణలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మొత్తం 0.37 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లుగా సర్వేలో తేల్చారు. అదేవిధంగా వాటి తొలగింపు చర్యలపై ఇవాళ సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. అయితే, ఆక్రమణకు గురైన స్థలంలో రెండు ప్రార్థనా మందిరాలు ఉండటంతో అవి తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ క్రమంలోనే స్పందించిన చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఎలాంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని వారికి సూచించారు.

Next Story