గుంటూరులో రిమాండ్ ఖైదీ పరారీ

by Vemula.Srinu Prasad |

గుంటూరులో రిమాండ్ ఖైదీ పరారీ అయ్యారు...

గుంటూరులో రిమాండ్ ఖైదీ పరారీ
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జీజీహెచ్(Guntur GGH) వద్ద రిమాండ్ ఖైదీ(Remand prisoner) పరారీ కావడం కలకలం రేపింది. చేబ్రోలులో నమోదైన హత్య కేసులో నాగుల్ మీరా రిమాండ్ ఖైదీగా జైలు ఉన్నారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షలు చేయించేందుకు గుంటూరు జీజీహెచ్‌కు జైలు పోలీసులు తీసుకొచ్చారు. అయితే పోలీసుల కళ్లు కప్పి నాగూల్ మీరా తప్పించుకుని పారిపోయారు. జీజీహెచ్ పరిసరాల్లో ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకుంటామని తెలిపారు.

Next Story