- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Remand: నకిలీ మద్యం కేసు.. నిందితుడు జనార్దన్ రావుకు రిమాండ్
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు (Janardhan Rao) పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు (Janardhan Rao) పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా (South Africa) నుంచి విజయవాడ (Vijayawada)కు వచ్చిన జనార్దన్ రావును శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ రాత్రి కోర్టులో ప్రవేశ పెట్టగా.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడు జనార్దన్ రావుకు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కేసులో మరిన్నీ కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. అయితే, ఇదే కేసులో ఇప్పటికే జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు, ప్రధాన అనుచరుడు కట్టా రాజును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
Next Story






