పిన్నెల్లి బ్రదర్స్‌కు రిమాండ్ పొడిగింపు

by Ajay Maddhiboyina |

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి ఆయ‌న సోద‌రుడు పిన్నెల్లి వెంక‌ట‌రామిరెడ్డికి రిమాండ్ పొడిగించారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్‌ను వర్చువల్‌గా విచారించిన జడ్జి జనవరి 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు.

పిన్నెల్లి బ్రదర్స్‌కు రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి ఆయ‌న సోద‌రుడు పిన్నెల్లి వెంక‌ట‌రామిరెడ్డికి రిమాండ్ పొడిగించారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్‌ను వర్చువల్‌గా విచారించిన జడ్జి జనవరి 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. ఇదిలా ఉంటే గుండ్లపాడులో టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6గా ఉన్నాడు. ఆయ‌న సోద‌రుడు పిన్నెల్లి వెంక‌ట‌రామిరెడ్డి ఏ7గా ఉన్నాడు. మే 24లో పాల్నాడు జిల్లా వెల్దుర్తి మండ‌లం గుండ్ల‌పాడుకు చెందిన అన్న‌ద‌మ్ములు జ‌విశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు, జ‌విశెట్టి కోటేశ్వ‌రరావులు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. వారు ప్ర‌యాణిస్తున్న బైకును కారుతో ఢీ కొట్టి బండ‌రాళ్ల‌తో కొట్టి హ‌త్య చేశారు. ఈ కేసులో మొత్తం 9మందిని నిందితులుగా చేర్చారు. వారిలో మాజీ ఎమ్మెల్యే సోద‌రులు కూడా ఉండ‌ట‌తో సుప్రీకోర్టు ఆదేశాల మేర‌కు లొంగిపోయారు.

Next Story