- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్‌స్కాంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్‌స్కాం కేసులో నిందితులకు ఈనెల 26 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ లిక్కర్‌స్కాం కేసులో నిందితులకు ఈనెల 26 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ్టితో వారి రిమాండ్ ముగిసిన నేపథ్యంలో నిందితులను సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రాజ్ కెసిరెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ , గుంటూరుజైలులో నవీన్ కృష్ణ, బాలాజీకుమార్ యాదవ్ రిమాండ్‌లో ఉన్నారు. రాజమహేంద్రవరంలో మిథున్‌రెడ్డి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. వారిని జీపు ఎక్కించే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి హడావుడి చేశారు. తానేమీ తప్పు చేయలేదని.. అన్యాయంగా తనను ఈ కేసులో ఇరికించారంటూ చెవిరెడ్డి ఆవేశంతో బిగ్గరగా అరిచారు.






