- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
లిక్కర్ స్కాం నిందితులకు దక్కని ఊరట.

దిశ, వెబ్ డెస్క్ : నకిలీ మద్యం కేసులో నిందితులకు కోర్టులో ఊరట లభించలేదు. నేటితో రిమాండ్ గడువు ముగియడంతో అధికారులు వారిని విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం వారి రిమాండ్ పొడిగించాలని అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు పిటిషన్ ను దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన కోర్టు అధికారుల వినతిపై సానుకూలత వ్యక్తం చేసింది. రిమాండ్ గడువును పొడిగించేందుకు అంగీకరించింది. జనవరి 12 వరకు నిందితుల రిమాండ్ కు అనుమతినిచ్చింది. దీంతో జోగి రమేశ్ సోదరులతో పాటు కేసులోని ఇతర నిందితుల రిమాండ్ గడువు ముందుకు పొడిగించడం జరిగింది. విచారణ అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా నిందితులను తిరిగి విజయవాడ జిల్లా జైలుకు అధికారులు తరలించారు.
ఈ సంచలన కేసులో అద్దెపల్లి జనార్ధన్ రావు (A1) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేశ్‌ను పోలీసులు 32వ నిందితుడిగా చేర్చారు. గత ప్రభుత్వ హయాంలో జోగి రమేశ్ ప్రోద్బలంతోనే ఇబ్రహీంపట్నం, తంబళ్లపల్లి ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలను నిర్వహించినట్లు అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి ఈ నకిలీ మద్యం మాఫియా ప్లాన్ చేసిందని, ఇందుకు జోగి రమేశ్ భారీగా ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారని దర్యాప్తు సంస్థ (SIT) ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించగా, లోతైన విచారణ కోసం పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారించే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు.






