- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Remand: పోసానికి మరో బిగ్ షాక్.. ఈ నెల 20 వరకు రిమాండ్
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి మరో బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనను పీటీ వారెంట్ (PT Warrant)పై శనివారం కర్నూలు (Kurnool) జిల్లా జైలు నుంచి విజయవాడలోని భవానీపురం (Bhavanipuram) పీఎస్‌కు తరలించారు. ఈ మేరకు పోసానిని పోలీసులు విజయవాడ (Vijayawada) సీఎంఎం కోర్టు (CMM Court)లో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆయనకు ఈనెల 20 వరకు రిమాండ్ విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దినేపట్లో పోసానిని కోర్టు నుంచి నేరుగా విజయవాడ జైలుకు తరలించనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan), కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియా (Social Media)లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై భవానీపురం (Bhavanipuram) పోలీస్ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైన విషయం విదితమే.
Read Also..






