- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PSR ఆంజనేయులుకు హైకోర్టులో ఊరట.. మెడికల్ బెయిల్ పొడిగింపు
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)లో భారీ ఊరట లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court)లో భారీ ఊరట లభించింది. APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఆయనకు తాజాగా రెండు నెలల పాటు మెడికల్ బెయిల్ పొడిగించినట్లు ధర్మాసనం తెలిపింది. కాగా, ఇటీవలే పీఎస్ఆర్ ఆంజనేయులు గుండె సంబంధిత సమస్యలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. జైలులో చికిత్స అందుబాటులో లేకపోవడంతో హైకోర్టులో మెడికల్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ వై లక్ష్మణ్ రావు (Justice Y Lakshman Rao) మెడికల్ బెయిల్‌కు అనుమతిచ్చారు.
Next Story






