లిక్కర్‌ స్కామ్ కేసులో మోహిత్‌‌రెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-10 07:29:36  IST  )

వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

లిక్కర్‌ స్కామ్ కేసులో మోహిత్‌‌రెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా.. ఆ తీర్పు సవాలు చేస్తూ తాజాగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విని కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కాగా, లిక్కర్‌ స్కామ్ కేసులో మోహిత్ రెడ్డిని A-39గా, ఆయన తండ్రి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని A-38 నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. జూన్‌ 18న భాస్కర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయగా.. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఆయన జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పంచేందుకు మోహిత్‌ రెడ్డి ప్రభుత్వ అధికార వాహనాల్లో తరలించారన్నది సిట్‌ ప్రధాన ఆరోపణగా ఉంది.

Next Story