- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajani: హైకోర్టులో మాజీ మంత్రి రజినీకి ఊరట
by Thanuru Gopichand |
క్రషర్స్ యజమానిని బెదిరించారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడుదల రజినీకి హైకోర్టులో ఊరట లభించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : క్రషర్స్ యజమానిని బెదిరించారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడుదల రజినీకి హైకోర్టులో (High court) ఊరట లభించింది. ముందస్తు బెయిలు (Bail) కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టి రజినీకి ముందస్తు బెయిలు మంజూరు చేసింది. మాజీ మంత్రి తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రజనీకి 41-ఎ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని రజినీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. రజినీ పీఏ రామకృష్ణకు కూడా 41-ఎ నోటీసులు ఇచ్చి విచారించాలని న్యాయస్థానం పేర్కొంది.
Next Story






