- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan : రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది : YS జగన్
ఇటీవల గుంటూరు జిల్లా తెనాలి(Tenali Incident)లో జరిగిన ఘటనలో పోలీసులు జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులను గంజాయి విక్రయం ఆరోపణలతో నడిరోడ్డుపై లాఠీలతో కొట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల గుంటూరు జిల్లా తెనాలి(Tenali Incident)లో జరిగిన ఘటనలో పోలీసులు జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులను గంజాయి విక్రయం ఆరోపణలతో నడిరోడ్డుపై లాఠీలతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జాన్ విక్టర్ తవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. కాగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం జగన్(YS Jagan).. నేడు తెనాలిలో విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని మండిపడ్డారు. ఈ దాడి పోలీసుల వికృత చర్య అని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారి పోయిందని, ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనం అని పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక గొంతులను అణగదొక్కుతున్నారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలంటే కూటమి ప్రభుత్వానికి చిన్నచూపని అన్నారు. గొడవను ఆపే ప్రయత్నం చేసినందుకే మంగళగిరి నుంచి కొట్టుకుంటూ తీసుకువచ్చి, నడిరోడ్డుపై దాష్టీకానికి పాల్పడ్డారని అన్నారు. తాము బడుగు బలహీన వర్గాల వైపే ఉంటామని, వారికి అన్యాయం జరిగితే సహించబోమని జగన్ స్పష్టం చేశారు.






