Lokesh: రెడ్​బుక్ ​అంటేనే వారికి గుండెపోటు.. మంత్రి లోకేశ్​ సెటర్లు

by Thanuru Gopichand |

కపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను రోజూ ఐదుగురు ప్రజలు, ఐదుగురు కార్యకర్తలతో మాట్లాడి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్​తెలిపారు.

Lokesh: రెడ్​బుక్ ​అంటేనే వారికి గుండెపోటు.. మంత్రి లోకేశ్​ సెటర్లు
X

రోజూ కార్యకర్తల నుంచి ఫీడ్​బ్యాక్​

పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ విస్మరించేది లేదు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ చెప్పండి

కూటమిలో మనది పెద్దన్న పాత్ర.. సమన్వయంతో ముందుకు సాగుదాం

మచిలీపట్నం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రిలోకేశ్​

దిశ డైనమిక్​ బ్యూరో : ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను రోజూ ఐదుగురు ప్రజలు, ఐదుగురు కార్యకర్తలతో మాట్లాడి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్​తెలిపారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేశ్​మాట్లాడారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో అనుసంధానించి పనిచేసిన వారిని గుర్తించాలన్నదే పార్టీ విధానమన్నారు.

అధికారంలోకి వచ్చాక కేడర్ ను మరువకుండా చంద్రబాబు, తాను జిల్లాలకు వెళ్లినపుడల్లా కార్యకర్తలను కలుస్తున్నట్లు తెలిపారు. పార్టీ సంస్థాగత విషయాలు, సమస్యలపై చంద్రబాబుతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు వివరించారు. 10 నిర్ణయాల్లో ఒక తప్పు జరగొచ్చు, వాటిని వివిధ స్థాయిల్లో తమ దృష్టికి తెస్తే సరిదిద్దుకుంటామని తెలిపారు.అహంకారం, ఇగోలను ప్రజలు హర్షించరని, గత పాలకులు అలా వ్యవహరించడం వల్లే 151 నుంచి 11కి పడిపోయారని పేర్కొన్నారు. ఎవరైనా నాయకులు తప్పుగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం పార్టీపై పడుతుందని హెచ్చరించారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, పెండింగ్ బిల్లుల సమస్యలుంటే మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

రెడ్​బుక్​అంటేనే వారికి గుండెపోటు

రెడ్‌బుక్‌ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు వస్తోందని మంత్రి లోకేశ్​ ఎద్దేవా చేశారు. చట్టపరిధిలో రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని లోకేశ్​ స్పష్టం చేశారు. వచ్చే నెల 2వతేదీ నుంచి ప్రతిఒక్కరూ గడపగడపకు వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని లోకేశ్​ కోరారు. సూపర్ – 6 కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి దివాలా తీయించిందని ఆరోపించారు. ప్రధాని మోడీ మనకు అన్నివిధాలా సహకరిస్తూ ఆక్సిజన్ అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైందన్నారు. కూటమిలో మనది పెద్దన్న పాత్ర, సమస్యలుంటే పరిష్కరించుకుని, సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.

ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ఏపీలో కొత్త ఏరోస్పేస్, డిఫెన్స్ ​పాలసీ 4.0 రాష్ట్రం రూపు రేఖలనే మారుస్తుందని, కొత్తగా సృష్టించిన క్లస్టర్లలో ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్​తయారీ, పరిశోధన, అభివృద్ధిలో ప్రపంచ కేంద్రంగా మారుస్తుందన్నారు. సెంటర్స్​ఆఫ్ ఎక్స్​లెన్స్, స్టార్టప్​ఇంక్యుబేషన్​వంటి ఫ్రేమ్​వర్క్​అందిస్తుందన్నారు. సాంకేతిక బదిలీ ప్రారంభించడం వంటి ఎండ్​టు ఎండ్​ఫ్రేమ్​వర్క్​ను అందిస్తుందని పేర్కొన్నారు. దేశ స్వయం సమృద్ధికి కొత్త ఏరోస్పేస్, డిఫెన్స్​పాలసీ దోహదపడుతుందని తెలిపారు. ఈ మేరకు లోకేశ్​ ఎక్స్​లో పోస్టు చేశారు

Next Story