ఏపీలో భారీ వర్షాలు.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి కుంభవృష్టి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి....

ఏపీలో భారీ వర్షాలు.. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో భారీగా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి కుంభవృష్టి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అధికంగా తూర్పుగోదావరి జిల్లా(EastGodavari District)లో వర్షం పాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ(Weather Department) అధికారులు తెలిపారు. కోనసీమ(Konaseema)లో పలుచోట్ల 40 మిల్లీ మీటర్ల వర్షపాతం అయినట్లు చెప్పారు. దేవరపల్లిలో 57.5, రామచంద్రాపురంలో 52.5, యర్నగూడెంలో 47.5, జంగారెడ్డిగూడెంలో 47, విజయనగరం రాజాంలో 20 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు పేర్కొన్నారు. దీంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళంతో పాటు మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు ఉరుములు, మెరుపులతో వర్షాల కురుస్తాయని చెప్పారు. ఈ సమయంలో పిడుగులు సైతం పడతాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పడిన పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారని, నలుగురికి గాయాలయ్యాయి వెల్లడించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story