- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు.. రెడ్ అలర్ట్!
by Geesa Chandu |
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

X
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో.. తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటిన వాయుగుండం జగదల్ పూర్ కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, విశాఖకు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఇది క్రమంగా దక్షిణ ఒడిషా- విదర్భ చేరుకొని బలహీన పడుతుందని అన్నారు.
ఈ వాయుగుండం వలన ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, కృష్ణా, ఏలూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించారు. అయితే ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, ఈ రోజు, రేపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వెల్లడించారు.
Next Story






