- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివరాత్రి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు.. గాంధీజీ ముఖానికి ముసుగేసి మరీ
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ శివరాత్రి వేడుకలు నిర్వహించగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ జాతిపిత గాంధీజీ విగ్రహం ఉండగా ఆయన విగ్రహానికి ముసుగు వేసి మరీ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరోసారి రికార్డింగ్ డ్యాన్సుల కలకలం రేగింది. ఇటీవల సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా చాలా చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. గ్రామాలు పట్టణాల్లో రాజకీయనాయకుల అండతో వీటిని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల ఓ స్కూల్ లోనూ విద్యార్థుల ముందే హాస్టల్ వార్డెన్ రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశాడు. ఫేరవెల్ డే సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడం పెద్ద ఎత్తున దుమారం రేపింది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో మంత్రి నారాలోకేష్ సైతం సీరియస్ అయ్యారు. ఆ వార్డెన్ ను సస్పెండ్ చేశాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ శివరాత్రి వేడుకలు నిర్వహించగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ జాతిపిత గాంధీజీ విగ్రహం ఉండగా ఆయన విగ్రహానికి ముసుగు వేసి మరీ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై భక్తులు మండిపడుతుండగా వీడియోలు వైరల్ అవ్వడంతో నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






