- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెగలు కక్కుతున్న సూర్యుడు.. రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు!
వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని దాదాపు 20కి పైగా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది...

దిశ, వెబ్ డెస్క్: వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని దాదాపు 20కి పైగా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కర్నూలులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, రాయలసీమ వ్యాప్తంగా పాదరసం 44 డిగ్రీల మార్కును దాటేసింది. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వేడి గాలులు తోడవ్వడంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
కోస్తా తీర ప్రాంతాల్లోనూ..
కేవలం రాయలసీమలోనే కాకుండా, కోస్తా తీర ప్రాంతాల్లో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా సముద్రపు గాలి వల్ల కోస్తాలో కాస్త ఉపశమనం ఉంటుందని భావిస్తారు, కానీ ఈసారి అక్కడ కూడా వేడి గాలులు సెగలు కక్కుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.






