రికార్డులు బ్రేక్ చేసిన పులస.. ఈ సారి ఎంత ధర పలికిందంటే..?

by Malleboina Mahesh |

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరదలతో పాటు మత్స్యకారులకు అదృష్టం కూడా.. పులస రూపంలో వస్తుంది.

రికార్డులు బ్రేక్ చేసిన పులస.. ఈ సారి ఎంత ధర పలికిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరదలతో పాటు మత్స్యకారులకు (fishermen) అదృష్టం కూడా.. పులస రూపంలో వస్తుంది. కేవలం గోదావరి నది (Godavari River)లో దొరికే ఈ పులస చేప (Pulasa fish)కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. కేజీ చేపకు రూ. 5 వేల నుంచి 30 వేల వరకు పెట్టి కొనుగోలు చేస్తారంటే.. ఈ చేప కు ఉన్న డిమాండ్ ఎలాంటి తో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా గోదావరి నది ఉప్పోంగుతుండటంతో పులసలకు భారీ డిమాండ్ ఏర్పడింది.

అయితే గతంలో మాదిరిగా ఎక్కువ సంఖ్యలో పులస చేపలు (Pulasa fish) మత్స్యకారులకు దొరక్కపోవడంతో.. డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈ రోజు ఉదయం యానాంలో గంగపుత్రుల వలకు చిక్కిన పులస చేప రికార్డులు బ్రేక్ చేసింది. 2 కేజీల చేపను ఏకంగా.. వేలంలో రూ.26 వేలకు ఆత్రేయపురం పేరవరం కు చెందిన బెజవాడ సతీష్ కొనుగోలు చేశాడు. జూలై 21న జరిగిన వేలంలో 2 కేజీల పులస చేప రూ.22,000కు అమ్మడు కాగా.. తాజాగా ఆ రికార్డు ఈ రోజు బ్రేక్ అయింది. ఈ సీజన్‌లో ఇదే ఇప్పటి వరకు పలికిన అత్యధిక ధరగా స్థానికులు చెబుతున్నారు.

Next Story