Amaravathi: అమరావతికి పునర్మిర్మాణానికి శ్రీకారం

by Thanuru Gopichand |

అమరావతి రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారు.

Amaravathi: అమరావతికి పునర్మిర్మాణానికి శ్రీకారం
X

దిశ డైనమిక్ బ్యూరో: అమరావతి రాజధాని (Amaravathi Rajadhani) పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra ) అమరావతికి రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయింది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2015 అక్టోబర్ 21న రాజధాని అమరావతికి ఉద్దండ్రాయునిపాలెం వద్ద ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని ఆయన తీసుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా రాజధాని నిర్మాణానికి అడుగులు వేసింది. పనులను పలు జోన్లుగా విభజించి మొదలుపెట్టింది. కేంద్రప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఇక్కడ స్థలాలను కేటాయించింది. అదేవిధంగా విట్, ఎస్ ఆర్ ఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు కూడా ఇక్కడ తమ బ్రాంచ్ లను ఏర్పాటు చేశాయి. ఆ సమయంలోనే సచివాలయం అసెంబ్లీ భవన నిర్మాణాలను పూర్తి చేశారు. హైకోర్టు భవనాలను కూడా నిర్మించారు.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొద్ది రోజులకే రాజధానిపై తమ మనసులో మాట వ్యక్తం చేసింది. ఏపీలో మూడు రాజధానులు నిర్మిస్తామంటూ అసెంబ్లీలో అప్పటి సీఎం జగన్ (YS Jagan) ప్రకటించారు. ఇంకోవైపు అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం కూడా చేశారు. దీంతో పనులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. రాజధాని రైతులు ఉద్యమ బాట పట్టారు. దాదాపు 5ఏళ్ల పాటు వారి ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. వారి ఉద్యమాన్ని ప్రభుత్వం అణచి వేసింది. 2024 లో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ ఓటమిని చవి చూసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వెను వెంటనే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అమరావతి నిర్మాణం పనులను మళ్ళీ ప్రారంభించేందుకు పూనుకున్నారు. రాజధాని నిర్మాణం ప్రస్తుత స్థితిగతులపై అంచనా వేయటానికి ఐఐటీ బృందాన్ని, ఢిల్లీ నుంచి నిపుణులను ఇ క్కడకు రప్పించారు. ఎన్డీఏ (NDA) ప్రభుత్వానికి ఇక్కడి తెలుగుదేశం, జనసేన మద్దతు కూడా ఇవ్వడంతో రాజధానికి నిధులు కూడా వెంటనే సమకూరాయి. ప్రపంచ బ్యాంకు నుంచి, ఏడీబీ బ్యాంక్ నుంచి రుణాలు సమకూరాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 15 వేల కోట్ల రూపాయలు రాజధానికి అందజేసింది. హడ్కో రాజధాని కట్టడానికి రుణంఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

మూడేళ్లలో ఏపీ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారు. విధులు కూడా సమకూరడంతో పనులకు టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి ను నరేంద్ర మోడీని పిలిపించి ఆయన చేతులుగా శంకుస్థాపన చేసిన రాజధాని పనులకు మరొకసారి ప్రారంభించాలని భావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దాదాపు ఖరారు అయింది. ఆయన వచ్చే నెల 15వ తేదీన అమరావతికి రానున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమరావతి పనులు వేగం పుంజుకోనున్నాయి.

Next Story