- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..ఎల్లుండి నుంచే !
10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్ష ఫీజులపై కీలక ప్రకటన వెలువడింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్ష ఫీజులపై కీలక ప్రకటన వెలువడింది. ఎల్లుండి నుంచి పదవ తరగతి పరీక్ష ఫీజు స్వీకరించినది ఏపీ విద్యా శాఖ. ఈనెల 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పదో తరగతి పరీక్ష ఫీజు స్వీకరిస్తామని అధికారికంగా ప్రకటన చేసింది ఏపీ విద్యాశాఖ. రెగ్యులర్, ఒకేషనల్, గతంలో 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్లు ఈ ఫీజును చెల్లించుకోవచ్చు.
అదే సమయంలో గడువు దాటినా కూడా, ఫీజు కట్టలేని వాళ్లకు అవకాశం కల్పించనున్నారు. అలా చూసుకున్నట్లయితే, లేట్ ఫీజు కింద డిసెంబర్ మూడో తేదీ వరకు పరీక్ష ఫీజుతో పాటు 50 రూపాయలు అదనంగా తీసుకుంటారు. అదే డిసెంబర్ 10వ తేదీ వరకు అయితే 200 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 15వ తేదీ వరకు చివరి అవకాశం ఉంటుంది. ఆ సమయం వరకు ఫీజు కడితే, 500 రూపాయల ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ.






