- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్ధం.. సిద్ధం అన్నారు కదా.. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా?
మొన్నటి వరకు వైసీపీ నేతలు సిద్ధం, సిద్ధం.. అంటూ ఎగిరి పడ్డారు.. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా..? అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు సిద్ధమా..?

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
వివేక హత్య, కోడి కత్తి డ్రామాపై చర్చకు సిద్ధమా..?
వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సవాల్
రాజంపేటలో పింఛన్ల పంపిణీ
దిశ, డైనమిక్ బ్యూరో : ‘మొన్నటి వరకు వైసీపీ నేతలు సిద్ధం, సిద్ధం అంటూ ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా..! అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు సిద్ధమా. మొన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై చర్చకు సిద్ధమా. వివేకా హత్య, కోడి కత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్విసిరారు. క్లైమోర్ మైన్లతో పేల్చినా తాను చలించలేదని, మీలా డ్రామాలు ఆ డ లేదని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇవాళ పేదల సేవలో కార్యక్రమం నిర్వహించారు. రాజంపేట మండలం మునక్కాయల వారిపల్లెలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పింఛన్ అందించారు. అనంతరం బోయినపల్లి ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు వారికి పెన్షన్లను పరిచయం చేసింది ఎన్టీఆరే అన్నారు. దివ్యాంగులు కాని వారికి, వైసీపీ కార్యకర్తలకు గత ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చిందని ఆరోపించారు. అర్హులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ సంపద పేదలకే పంచి పెట్టాలని స్పష్టం చేశారు. సమైఖ్య రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేశాననని, ఈ 30 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే తన ఆశయమని చెప్పారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
అభివృద్ధి జరగాలి.. ఆదాయం పెరగాలి
అభివృద్ధి జరగాలి ఆదాయం పెరగాలి అనేది తన అభిమతమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. గతంతో తాను ఐటీ, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారని, నేడు చాలా కుటుంబాలను ఆర్థికంగా ఎదిగేలా చేసింది ఐటీనేనని పేర్కొన్నారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని మరోసారి ప్రకటించారు. సంపద సృష్టించటం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. అప్పులు చేసి న ఏ కుటుంబం కూడా బాగుపడదని, ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితంలో మార్పు సాధ్యమని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లు కనిపిస్తారని చెప్పారు. ఉన్నత విద్య, ఉపాధి వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తు న్నారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చాయన్నారు. 2014–19 లో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారి రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి పోటీ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్ళీ స్వేచ్ఛ వచ్చిందన్నారు. దేశాభివృద్ధిలో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
ప్రజల కోసమే అధికారం..
గత పాలకుల అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసమే అధికారం ఉపయోగిస్తుందని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవని హె చ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే ముందు పది సార్లు ఆలోచించాలన్నారు. కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. రాజంపేటలో వ్యవసాయం తగ్గిందని, ఉద్యాన పంటలు పెరిగాయన్నారు. గంగానది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని అభిప్రాయపడ్డారు. వంశధార నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తామని తెలిపారు. మీరు ఆశీర్వదిస్తే కొండలనైనా పిండిచేస్తానని చెప్పుకొచ్చారు. ఒంటిమిట్టను టీటీడీ దత్తత తీసుకుని, అనేక కార్యక్రమాలను చేపట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు.






