- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahanadu: మహానాడుకు .. ముస్తాబు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు పనులు చివరి దశకు చేరుకున్నాయి.

చివరి దశకు చేరుకున్న మహానాడు ఏర్పాట్లు
13 కమిటీల ఆధ్వర్యంలో శరవేగంగా పనులు
వైరల్అవుతున్న మహానాడు ప్రాంగణం డ్రోన్వీడియో
రేపు సాయంత్రానికి కడపకు చంద్రబాబు, లోకేశ్రాక
29న ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు పనులు చివరి దశకు చేరుకున్నాయి. వైఎస్‌ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని పబ్బాపురం సమీపంలో 27, 28, 29న ఈ పసుపు పండుగ నిర్మించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. వందలాదమంది కార్మికులు 145 ఎకరాల సువిశాల ప్రాగంణంలో రేయిపగళ్లు శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నారు. మహా నాడు ఏర్పాట్లకు సంబంధించిన డ్రోన్వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్అవుతోంది. 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న ప్రతినిధుల సభకు 23 వేల మందిని ఆహ్వానించారు. మొదటి రెండ్రోజులు రాయలసీమ అభివృద్ధి, రాష్ట్ర సమస్యలపై చర్చించి తీర్మానాలను ఆమోదించనున్నారు. 29వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు ఐదు లక్షలమంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, (Chanrababu Naidu) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కడపకు చేరుకోనున్నారు. కడప విమానాశ్రయం నుంచి మహానాడు ప్రాంగణానికి చేరుకునే మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులకు ఘనంగా ఆతిథ్యం ఇవ్వడానికి వివిధ వంటకాల తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి.
అన్ని జిల్లాల్లో మినీ మహానాడు
ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలలో మినీ మహానాడులు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొని మహానాడు విజయవంతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విదేశాల్లో సైతం మినీ మహానాడు నిర్వహిచడం విశేషం. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు.






