- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan : కూటమిపై పోరుకు రెడీ..4న తాడేపల్లికి వైఎస్. జగన్ !
వైసీసీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)విదేశీ పర్యటన అనంతరం ఏపీకి రాబోతున్నారు. ఈనెల 4వ తేదీన బెంగుళూరు నుంచి తాడేపల్లి(Tadepalli)కి చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యార్థు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్ తో ఈనెల 5వ తేదీన వైసీపీ ఫీజుపోరు ఆందోళన కార్యక్రమం నిర్వహించనుంది.

దిశ, వెబ్ డెస్క్ : వైసీసీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)విదేశీ పర్యటన అనంతరం ఏపీకి రాబోతున్నారు. ఈనెల 4వ తేదీన బెంగుళూరు నుంచి తాడేపల్లి(Tadepalli)కి చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యార్థు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్ తో ఈనెల 5వ తేదీన వైసీపీ ఫీజుపోరు ఆందోళన కార్యక్రమం నిర్వహించనుంది. ఫీజుపోరుతో పాటు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపైన చేపట్టాల్సిన ఆందోళనల నిర్వహణపై జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించనుున్నారు.
తాడేపల్లికి చేరుకున్న తర్వాతా జిల్లా నేతలతో జగన్ పార్టీ పటిష్టతపై చర్చించే క్రమంలో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీలోని పదవుల భర్తీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు జగన్ తీసుకుంటారని సమాచారం. మార్చి నుండి తాను చేపట్టనున్న జిల్లాల పర్యటన నేపథ్యంలో తాడేపల్లి సమావేశాల్లో పార్టీ నేతలను సమాయత్తం చేయనున్నారు.
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈనెల 5వ తేదీన తల పెట్టిన వైసీపీ ఫీజుపోరు ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈసీకి వైసీపీ నాయకత్వం లేఖ రాసింది. వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు ర్యాలీకి అనుమతివ్వాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతివ్వాలని ఎన్నికల అధికారిని కోరారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్ చెల్లించామని.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 3,900 కోట్లు చెల్లించకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 5న నిరసన కార్యక్రమాలను ఏర్పాట్లు చేసుకున్నారని..మండలి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. అందువల్ల నిరసన కార్యక్రమాలకు అనుమతివ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని లేఖలో కోరారు.






