పర్యాటక, ఆధ్యాత్మిక హబ్‌గా రాయలసీమ : మంత్రి కందుల దుర్గేష్

by Ramesh Naini |

రాయలసీమ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

పర్యాటక, ఆధ్యాత్మిక హబ్‌గా రాయలసీమ : మంత్రి కందుల దుర్గేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాయలసీమ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పటికే అనేక కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.

విశాఖ, తిరుపతిలు ఐకానిక్ హబ్‌లు..

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే రాయలసీమను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, తిరుపతిలను ‘ఐకానిక్ హబ్‌’లుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు.

శ్రీవారి సేవలో మంత్రి..

అంతకుముందు తిరుమలకు చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్‌కు టీటీడీ అధికారులు లాంఛనప్రాయంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం.. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను మంత్రికి అందజేశారు.

Next Story