సీటు వేరే వారికి ఇస్తే నా నిర్ణయం ప్రకటిస్తా.. TDP నేత కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   (  Updated:2024-02-20 07:36:18  IST  )

ఏపీలో రాయచోటి నియోజకవర్గ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రధాన పార్టీల కీలక నేతలు ఉత్సాహం చూపుకున్నారు.

సీటు వేరే వారికి ఇస్తే నా నిర్ణయం ప్రకటిస్తా.. TDP నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాయచోటి నియోజకవర్గ టికెట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రధాన పార్టీల కీలక నేతలు ఉత్సాహం చూపుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాయచోటి ఇన్‌చార్జి రమేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రమేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ టికెట్ కోసం చాలా మంత్రి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తనకు కాకుండా ఈ నియోజకవర్గాన్ని మరొకరికి కేటాయిస్తే నా నిర్ణయం ప్రకటిస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా రాయచోటి ఉండేది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. వైఎస్ మరణం తర్వాత జగన్‌ సారథ్యంలో ఏర్పడిన వైసీపీ అక్కడ సత్తా చాటుతోంది. వైసీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో తిరుగులేని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డిని ఢీకొట్టబోయే టీడీపీ నేత ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read More..

నేడు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన..ఆ కుటుంబాలకు ఆర్ధిక సహాయం

Next Story