- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రసాదం కౌంటర్ లో ఎలుకలు.. ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్
ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా జరుగుతున్న ఘటనలు.

దిశ, వెబ్ డెస్క్ : అన్నవరం ప్రసాదం (Annavaram Prasadam) మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. ప్రసాదంలో నత్త వచ్చిందంటూ ఇటీవల ఓ జంట హడావిడి చేశారు. వీడియోను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో అన్నవరం ప్రసాదం అపవిత్రమైందంటూ నెటిజన్లు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. దేవాలయ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ప్రసాదం చాలా పరిశుద్ధమైన విధానంలో చేస్తారని, అందులో నత్త వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. సదరు జంట కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని కూడా అన్నారు. దేవాలయ పేరు ప్రతిష్టాలను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆ ఘటనపై పోలీసులకు కూడా అధికారులు ఫిర్యాదు చేయగా జంటపై కేసు నమోదైంది. ఇప్పుడు ఈ ఘటనను మరవక ముందే ప్రసాదానికి సంబంధించిన మరో వివాదం తలెత్తింది.
అన్నవరం హైవేపై ఉన్న ప్రసాదం కౌంటర్ (Prasadam Counter) లో ఎలుకలు చక్కర్లు (Rats Run) కొడుతూ కనిపించాయి. ప్రసాదం బుట్టలో దుంకుతూ, పరుగులు పెడుగూ ఎలుకలు హడావిడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విశాఖకు చెందిన ఓ భక్తులు వీడియోను పోస్టు చేయడంతో అన్నవరం ప్రసాదం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ విషయమై అక్కడ సిబ్బంది భక్తులు ప్రశ్నించగా.. కొనుక్కుంటే కొనుక్కోండి లేదంటే వెళ్లిపోండంటూ దురుసుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రసాదం కౌంటర్ ఎలుకల హల్ చల్ విషయం కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు చాలా సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపించారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ ఉత్తర్వులను జారీ చేశారు.






