- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబు గృహప్రవేశ సమయంలో అరుదైన దృశ్యం(ఫొటో వైరల్)
ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు కుప్పంలో కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు కుప్పంలో కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున 4:30 గంటలకు భార్య, కుమారుడు లోకేష్ దంపతులతో నూతన గృహంలో అడుగుపెట్టారు. గృహ ప్రవేశం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా ప్రజల కోసం సీఎం చంద్రబాబు మంచి విందును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి టీడీపీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారైనట్లు సమాచారం.
అయితే.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) కుటుంబం నూతన ఇంటి గృహప్రవేశ సమయంలో అరుదైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. నారా వారి ఇంటి చుట్టూ వలయాకారంలో ఇంధ్రధనస్సు(Rainbow) ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. పలువురు ఆ ఫొటో షేర్ చేస్తూ.. దేవదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయంటూ కామెంట్లు పెడుతున్నారు.






