- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం
by Ajay Maddhiboyina |
వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. భారత్ తరఫున ఐక్యరాజ్యసమితిలో మిథున్ రెడ్డి ప్రసంగించారు. అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ఆయన మాట్లాడారు.

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. భారత్ తరఫున ఐక్యరాజ్యసమితిలో మిథున్ రెడ్డి ప్రసంగించారు. అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ఆయన మాట్లాడారు. పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారానే వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని అదే భారత్ విశ్వసిస్తుందని మిథున్ రెడ్డి వెల్లడించారు. పైరసీ, సముద్ర ఆయుధ దోపిడీకి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల ఇమ్యునిటీ ముసాయిదాలపై భారత్ కు ఉన్న అభ్యంతరాలను వివరించారు. ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్యదేశం అని, ఐరాసా విధి విధానాలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను సమగ్రంగా నమోదు చేయాలని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story






