- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఐ చిన్న మల్లయ్యపై రేప్ కేసు
వినకొండలో మాజీ సీఐపై లైంగిక దాడి ఆరోపణలు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది.....

దిశ, వినుకొండ: వినకొండలో మాజీ సీఐపై లైంగిక దాడి ఆరోపణలు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య తనపై బలవంతంగా అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లి వద్ద చిన్న మల్లయ్యకు చెందిన నాటు కోళ్ల ఫారాన్ని అద్దెకు తీసుకుని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో చిన్న మల్లయ్య బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తనకు న్యాయం చేయాలని కోరుతూ సదరు మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఒకప్పుడు శాంతిభద్రతలను కాపాడాల్సిన హోదాలో ఉన్న వ్యక్తిపైనే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.






