Rankings: మంత్రుల ర్యాంకింగ్స్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారంటే?

by Shiva |
Rankings: మంత్రుల ర్యాంకింగ్స్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరున్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting)లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ మంత్రుల ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. వివిధ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్‌లో ముందంజలో ఉన్న మంత్రుల పేర్లను ప్రకటించారు. అయితే, అందరి కన్నా ముందు చట్టం, న్యాయ మంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ (NMD Farooq) ఉన్నారు. అదేవిధంగా 6వ స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pavan Kalyan) ఉన్నారు.

ఇక 8వ స్థానంలో మంత్రి నారా లోకేశ్ (Nara LokesH) నిలిచారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subhash) నిలిచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. మంత్రులు శాఖ పరమైన వ్యవహారంలో చురుకుగా గేర్ అప్ కావాలని సూచించారు. మొదటి ఆరు నెలలు వదిలేశామని.. ఇక నుంచి ఫైళ్లను క్లియర్ చేయకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ వచ్చిందని, త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ కూడా రాబోతోందని అన్నారు. కేంద్ర నుంచి నిధులను మనమే తెచ్చుకోవాలని గుర్తు చేశారు. రాబోయే మూడు నెలలు మంత్రులు అంతా.. జనంలోనే ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను మంత్రులు బాధ్యత తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.

మంత్రుల ర్యాంకింగ్స్ ఇలా..

1. ఎన్ఎండీ ఫరూక్

2. కందుల దుర్గేశ్

3. కొండపల్లి శ్రీనివాస్

4. నాదెండ్ల మనోహర్

5. బాల వీరాంజనేయ స్వామి

6. చంద్రబాబు నాయుడు

7. సత్యకుమార్ యాదవ్

8. నారా లోకేశ్

9. బీసీ జనార్దన్ రెడ్డి

10. కొణిదెల పవన్ కళ్యాణ్

11. సవిత

12. కొల్లు రవీంద్ర

13. గొట్టిపాటి రవి

14. పొంగూరు నారాయణ

15. టీజీ భరత్

16. ఆనం రామాయణ రెడ్డి

17. కింజారపు అచ్చెన్నాయుడు

18. ఎం.రాంప్రసాద్ రెడ్డి

19. గుమ్మడి సంధ్యారాణి

20. వంగలపూడి అనిత

21. అనగాని సత్యప్రసాద్

22. నిమ్మల రామానాయుడు

23. కొలుసు పార్థసారథి

24. పయ్యావుల కేశవ్

25. వాసంసెట్టి సుభాష్.

Advertisement
Next Story