Ramzan 2026: శుక్ర‌వారం సెలవు లేదు..స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న

by velandi.Saikiran |

శుక్రవారం రోజున రంజాన్ హాలిడే కాకుండా, శనివారం నిర్ణయించినట్లు తాజాగా మరో ప్రకటన చేసింది ఏపీ సర్కార్.

Ramzan 2026: శుక్ర‌వారం సెలవు లేదు..స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రంజాన్ ( Ramzan 2026) హాలిడేపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజున హాలిడే కాకుండా, శనివారం అంటే మార్చి 21వ తేదీకి పబ్లిక్ హాలిడేను నిర్ణయించినట్లు తాజాగా మరో ప్రకటన చేసింది. శుక్ర వారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ పని దినం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చింది ఏపీ సర్కార్. కానీ ముస్లిం ఉద్యోగుల‌కు మాత్రం ప‌నివేళల్లో వెసులుబాటు క‌ల్పించింది స‌ర్కార్‌.

రంజాన్ పండగ మార్చి 21వ తేదీన జరుపుకోవాలని ఏపీలోని మత పెద్దలు సూచించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సెలవును వాయిదా వేస్తున్నట్లు ఏపీ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది. దీని ప్రకారం శనివారం మార్చి 21వ తేదీన గవర్నమెంట్ హాలిడే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అయితే శనివారం జరగాల్సిన పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష నిర్వహణపై సర్కార్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Next Story