- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక శ్రీకాకుళం వాసిగా నాకు ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అవిశ్రాంత కృషి, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్‌ల తర్వాత, పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన GI ట్యాగ్ లభించడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు.. శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవమని అన్నారు. మన శ్రీకాకుళం గర్వం ఇప్పుడు నేడు దేశానికే గర్వకారణం అని కొనియాడారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన, మహాత్మా గాంధీకి ప్రియమైన పోందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుందని తెలిపారు.
ఎన్నో కష్టాలు వచ్చినా మన నేత కార్మికులు తమ కళను వదల్లేదని, వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయన్నారు. ‘వారి చేతులు కేవలం వస్త్రాన్ని మాత్రమే కాదు ఒక గుర్తింపును నేసాయి.ఈ GI ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ & గ్రామీణ పరిశ్రమల కమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. తరతరాలుగా ఈ కళను కాపాడిన మన నేత కార్మికులకు ఈ గౌరవం అంకితం. ఈ GI ట్యాగ్ వారి గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది, వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది, పొందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో కొత్త వైభవం తెస్తుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..






