- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామతీర్థంలో సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాల నిమజ్జనం
రామతీర్ధం కోదండరామస్వామి ఆలయంలో ధ్వంసమైన విగ్రహాలను నేడు గోదావరి నదిలో నిమజ్జనం చేయనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండగా పిలిచే నీలాచల పర్వతంపై వెలసిన కోదండ రామస్వామి ఆలయంలో ఆరేళ్ల క్రితం దుండగుల దాడిలో ధ్వంసమైన పురాతన రాముడి విగ్రహం, సీతాదేవి, లక్ష్మణస్వామిల విగ్రహాలను నేడు నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం 4.48 గంటలకు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలోని గోదావరి తీరంలో నిమజ్జనం చేయనున్నారు.
వైసీపీ హయాంలో 2020 డిసెంబర్ 28న అర్ధరాత్రి సమయంలో దుండగులు రామతీర్ధంలోని ఆలయంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై కేసులు కూడా నమోదై.. న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. టీటీడీ ఎస్వీ శిల్ప ఉత్పత్తి కేంద్రంలో తయారు చేయించిన నూతన విగ్రహాలను ఇటీవలే పునః ప్రతిష్టించారు. ధ్వంసమైన విగ్రహాలను ఏ ఆలయంలోనూ ఉంచకూడదని ఆగమశాస్త్రం చెబుతోంది. ఇప్పటి వరకూ కేసు విచారణకోసం రాములవారి విగ్రహంలో శిరస్సు భాగం కోర్టులో ఉండటంతో నిమజ్జనం చేయడం సాధ్యం కాలేదు. దీనికోసం దేవాదాయశాఖ కోర్టును ఆశ్రయించగా.. వారంరోజుల క్రితం విగ్రహాల నిమజ్జనానికి కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో విగ్రహాలను నిమజ్జనం చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు.






