మెడికల్ మాఫియాను అరికట్టాలి.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బోగస్ మెడిసిన్స్ తయారు చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

మెడికల్ మాఫియాను అరికట్టాలి.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బోగస్ మెడిసిన్స్ తయారు చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం ప్రాణవాయువు లాంటివని అన్నారు. విద్య, వైద్యం పవిత్రమైనవని వీటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సామాన్య విద్యను, మెడికల్ విద్యను సైతం ఇప్పుడు ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.

మందుల తయారీలోకి అనేక నకిలీ కంపెనీలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆ కంపెనీలు నాణ్యత లేని మందులను తయారు చేస్తున్న కంపెనీలకు రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టులు అప్పగించాలని చూస్తుందని ఆరోపించారు. తక్కువ ధరలకు ఇచ్చే కంపెనీలకే ఇస్తామని చెబుతున్నారని, తక్కువ ధరలకు అలాంటి కంపెనీలే సప్లై చేస్తాయని విమర్శించారు. ప్రభుత్వం ముందుగా మందులు తయారు చేస్తున్న కంపెనీల వద్దకు వెళ్లి పరిశీలించాలని అన్నారు. సర్టిఫై చేసిన మందులనే సప్లై చేయాలని సూచించారు. అలా చేస్తేనే నకిలీ మందులకు చెక్ పెట్టవచ్చని అన్నారు.

Next Story