చంద్రబాబుపై ఆరోపణలు.. విజయసాయిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-07-25 16:04:08  IST  )

ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

చంద్రబాబుపై ఆరోపణలు.. విజయసాయిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రూ. 15 వేల కోట్ల ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేశారు. ‘‘పోలవరం జాతీయ ప్రాజెక్టు. నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది. అవినీతి చేసేందుకే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. 2014-19లో చాలా అవినీతి జరిగింది. అవినీతి నుంచి బయటపడేందుకే చంద్రబాబు ఎన్డీఏలో చేరారు. ఎన్డీయేకి, చంద్రబాబుకి క్విడ్ ప్రోకో ఉంది.’’ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రబడ్జెట్‌పై మాట్లాడాలని, పోలవరంలో అవీనితి జరిగి ఉంటే ఆధారాలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయొద్దని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ హెచ్చరించారు.

Next Story