Tirumala:శ్రీవారి సేవలో రాజీవ్ కనకాల, సుమ

by Jakkula.Mamatha |

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు.

Tirumala:శ్రీవారి సేవలో రాజీవ్ కనకాల, సుమ
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు. ఈ తరుణంలో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తిరుమల(Tirumala) చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు రాజీవ్ కనకాల(Rajiv Kanakala), ఆయన సతీమణి యాంకర్ సుమ(Anchor Suma) ఇవాళ(శనివారం) తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మొదటగా వీరికి అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

Next Story