చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌కు విడదల రజిని.. పాస్ పోర్ట్ అప్పగింత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-03 08:31:46  IST  )

మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఆమె తన పాస్‌పోర్ట్‌ను పోలీసు అధికారులకు అప్పగించారు. ..

చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్‌కు విడదల రజిని.. పాస్ పోర్ట్ అప్పగింత
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి విడదల రజిని(Former Minister Rajini rajini) చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌(Chilakaluripet Police Station)లో హాజరయ్యారు. హైకోర్టు(High Court) గతంలో జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఆమె తన పాస్‌పోర్ట్‌ను పోలీసు అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ రిజిస్టర్‌లో ఆమె సంతకం చేశారు. న్యాయస్థానం నిబంధనల మేరకు విచారణకు సహకరించే ప్రక్రియలో భాగంగా ఆమె ఈ చర్యలు చేపట్టారు.

ఇద్దరు లాయర్లతో...

విడదల రజిని పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఆమె వెంట ఇద్దరు న్యాయవాదులను ఉండేందుకు పోలీసులు అనుమతించారు. చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించారు. పాస్‌పోర్ట్ అప్పగింత ప్రక్రియ ముగిసిన అనంతరం విడుదల రజిని అక్కడి నుండి వెనుదిరిగారు.

కవిత నన్ను రూ.10 కోట్లు అడిగింది.. కేఏ పాల్ సంచలన ఆరోపణలు

Next Story