- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఆ పీఎస్‌కు విడదల రజిని, అంబటి.. అసలు విషయం ఇదే!
by Kema Shiva Kumar |
వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు విడదల రజిని (Vidadala Rajini), అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇవాళ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు విడదల రజిని (Vidadala Rajini), అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇవాళ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అయితే, రెంటపాళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పర్యటన సందర్భంగా జరిగిన ఘటనపై పోలీసులు వారిని ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. జగన్ టూర్ సందర్భంగా పోలీసుల విధులకు అడ్డుపడ్డారంటూ అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. దీంతో కేసులో ఇవాళ విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా నిబంధనలను ఉల్లంఘించిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి విడదల రజినీపై కేసు బుక్ అయింది. దీంతో ఆమెను కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ ఇద్దరి విచారణల నేపథ్యంలో సత్తెనపల్లి (Sattenapalli)లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Next Story






