పవన్ కళ్యాణ్‌ను కలిసిన రాజేంద్రప్రసాద్.. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-18 12:19:00  IST  )

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కలిశారు.

పవన్ కళ్యాణ్‌ను కలిసిన రాజేంద్రప్రసాద్.. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కలిశారు. నేడు(ఆదివారం) మంగళగిరి(Mangalagiri)లోని క్యాంపు కార్యాలయం(Camp Office)లో మధ్యాహ్నం మర్యాదాపూర్వకంగా పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)తో నటుడు రాజేంద్ర ప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలపై చర్చించుకోనున్నట్లు సమాచారం. మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను ఆయన సన్మానించారు. రాజేంద్రప్రసాద్‌ను పవన్ కళ్యాణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోన్నాయి.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తమిళనాడు పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. తన కుమారుడు అకీరానందన్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో పాల్గొన్నారు. ఇక మురుగన్ దర్శనం తర్వాత ఆలయ ఆవరణలో మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటివరకు 5 సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయాల దర్శనం పూర్తయిందని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణ భారత రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శన చేపట్టిన పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడులోని ఆలయాలను సందర్శించారు.

Next Story