- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: పోసానికి గుండె జబ్జు.. వైద్యుల కీలక ప్రకటన
వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళికి ఎకో టెస్ట్ అవసరమని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళికి(Posani Krishna Murali) ఎకో టెస్ట్ అవసరమని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు(Rajampet Government Hospital Doctors) తెలిపారు. విద్వేషాలు, వైషమ్యాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే శనివారం మధ్యాహ్న సమయంలో జైలులో పోసాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ మేరకు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కీలక సూచనలు చేశారు. పోసాని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అయితే ఆయన గుండె జబ్జుతో బాధపడుతున్నట్లు స్పష్టంచేశారు. ప్రస్తుతం పోసానికి ఎకో టెస్ట్ అవసరమని, ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలు ఉన్నామని తెలిపారు. గతంలోనూ పోసాని గుండెకు చికిత్స చేయించుకున్నారని వెల్లడించారు. పోసాని విజ్ఞప్తి మేరకే వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం పోసానికి మెరుగైన చికిత్స అవసరమని చెప్పారు. ఇందుకోసం కడప రిమ్స్‌కు వెళ్లాలని రిఫర్ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు.






