- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవర్ హత్యకేసు.. ఎమ్మెల్సీ అనంతబాబు షాకిచ్చిన కోర్టు
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను రాజమండ్రి స్పెషల్ కోర్టు కొట్టివేసింది.

దిశ, వెబ్‌డెస్క్: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్యకేసులో అరెస్టైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు రాజమండ్రి స్పెషల్ కోర్టు నిరాకరించింది. సాక్షుల్ని బెదిరించిన కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు తరపు లాయర్ రాజమండ్రి స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్ ను కొట్టివేసింది. డ్రైవర్ హత్యకేసులో ఆయన నలుగురు సాక్షుల్ని.. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకుంటే చంపుతానని బెదిరించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసిన సర్పవరం పోలీసులు.. ఈ ఏడాది ఏప్రిల్ 24న అరెస్ట్ చేశారు. అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో సాక్షులను కోర్టు విచారిస్తోంది. కీలక సాక్షులైన మణికంఠ, శివదుర్గాప్రసాద్ ల స్టేట్ మెంట్ ను జడ్జి రికార్డు చేశారు. డ్రైవర్ హత్య జరిగిన సమయంలో వారు చూసిన విషయాలను ఇద్దరూ జడ్జికి వివరించారు. ఈనెల 26వ తేదీ వరకూ సాక్షుల విచారణ కొనసాగనుండగా.. మిగతా సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేయనుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీని కూడా కోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే కోర్టు డ్రైవర్ హత్యకేసులో బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే.






