పందెం రాయుడు.. కోడిపందెంలో రూ.1.53 కోట్లు గెలిచిన రాజమండ్రి రమేష్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-15 12:10:52  IST  )

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి.

పందెం రాయుడు.. కోడిపందెంలో రూ.1.53 కోట్లు గెలిచిన రాజమండ్రి రమేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ఓ భారీ పందెం అందరి దృష్టినీ ఆకర్షించేందకు ఈ ఒక్క పందెంలోనే ఒక వ్యక్తి ఏకంగా రూ.1.53 కోట్లు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్,రాజమండ్రికి చెందిన రమేష్ ల మధ్య హోరాహోరీ పందెం జరిగింది. ఈ ఉత్కంఠ భరిత పోరులో రమేష్ కోడి గెలవడంతో ఆయన పందెం సొమ్ము రూ.1.53 కోట్లను గెలుచుకున్నారు. పందెంరాయుళ్లు కేవలం కోళ్ల బలాబలాలే కాదు.. జాతకాలు, ముహూర్తాలు పెట్టుకుని మరీ కోళ్లను బరుల్లోకి దింపుతుండటం గమనార్హం.

Next Story