మిగులు జలాలు వాడుకుంటే తెలంగాణకు వచ్చిన ఇబ్బందేంటి..?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మిగులు జలాలు వాడుకుంటే తెలంగాణకు వచ్చిన ఇబ్బందేంటని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు...

మిగులు జలాలు వాడుకుంటే తెలంగాణకు వచ్చిన ఇబ్బందేంటి..?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మిగులు జలాలు వాడుకుంటే తెలంగాణ(Telangana)కు వచ్చిన ఇబ్బందేంటని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్(Rajamundry Mla Adireddy Srinivas) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం చెప్పడంపై ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని, బనకచర్ల కడితే రాష్ట్రానికి సాగు, తాగు నీరు అందుతుందన్నారు. కొందరు కావాలనే బనకచర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ బాగుండాలనేదే మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఆలోచనని చెప్పారు.బనకచర్లతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.

Next Story