- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కనకదుర్గమ్మను దర్శించుకున్న రాజధాని మహిళలు, రైతులు
by Naga Rani Yarlagadda |
రాజధాని ప్రాంత రైతులు కాలినాడకన దుర్గమ్మ సన్నిథికి చేరుకున్నారు. అమ్మవారికి చీర, సారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజధాని ప్రాంతమైన అమరావతి నుంచి మహిళలు, రైతులు కాలినడకన విజయవాడ ఆలయానికి చేరుకున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, సారెలను అమ్మవారికి సమర్పించారు. దుర్గమ్మను దర్శించుకున్నారు. రాజధాని ప్రాంతం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతుండటం, చట్టబద్ధమైన గుర్తింపు లభించడంతో రైతులు ఈ కృతజ్ఞతా యాత్ర చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
Next Story






